నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక ఉండటంతో పాలక, ప్రతిపక్షాలు ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ(మంగళవారం) సాగర్ లోమంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు కొంత మంది.అనుముల మండలం కొత్తపల్లిలో ఓ ప్రైవేట్ టీచర్ నిరుద్యోగ భృతి, ఉద్యోగాలపై మంత్రి ని నిలదీశాడు. ప్రచారం ముందుకు సాగకుండా అడ్డుకున్నాడు. టీచర్ అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి.. నీలాంటి వారిని చాలా మందిని చూశా... నీతో పాటు మీ నాయకులపై కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరించారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అలర్టై ఆ ప్రైవేటు టీచర్‌ను పక్కకు లాక్కెళ్లడంతో జగదీశ్‌రెడ్డి ప్రచార వాహనం అక్కడి నుంచి ముందుకు కదిలింది.
